మాందాపూర్ జడ్పీలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

నవతెలంఆణ బీబీపేట్: మండలంలోని మాందాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ పాఠశాలలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ స్త్రీ విద్య కోసం, మహిళా అభ్యున్నతి కోసం తన జీవితాంతం కృషి చేశారని, మాతృత్వాన్ని సైతం త్యాగం చేసిన గొప్ప మానవతా మూర్తి, గొప్ప సంఘసంస్కర్త అని సావిత్రిబాయి పూలే గారిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సారయ్య, ప్రభాకర్ ఆయా పాఠశాలల ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.