సామాజిక విప్లవమూర్తి సావిత్రిబాయి పూలే

సామాజిక విప్లవమూర్తి సావిత్రిబాయి పూలేమూడు వేల ఏండ్ల మనుస్మృతి మానసిక విషమ చట్టాల మాటున దేశంలో మెజార్టీ ప్రజలకు సకల హక్కులు నిషేధం. ద్వితీయ శ్రేణి పౌరురాలుగా అణిచివేతకు గురైన ఓ మహిళ, నాగరికపు సమాజాన్ని నిర్మించడానికి నానా కష్టాలు అవమానాలు భరించింది. మనుషులు అందరూ సమానులే నని చాటడానికి తన జీవితాంతం కృషి చేసింది. శూద్రులు మహిళలకు అస్పృశ్యులకు విద్య అనే ఆయుధాన్ని అందించింది. ఆమె నాటి చీకటి సమాజానికి వెలుగు దివిటి అందించింది. ఆమె వీరవనిత, సామాజిక విప్లవ మాతృమూర్తి, చదువుల తల్లి సావిత్రిభాయి పూలే. సావిత్రిభాయి కృషిని సరస్వతి దేవి దయగా మార్చేస్తున్న మనువాదపు కుతంత్రాలను చేధించాల్సిన అవసరం ఉంది. వేల ఏండ్లుగా శూద్రులు అస్పశ్యులకు మహి ళలు చడవకూడదు చదువు వినకూడదనే కఠిన విషమ షరతులు నూటికి 90శాతం మందిని నిరక్షరాస్యులుగా అనాగరిక సమా జంలో వదిలేసింది. దీనివల్ల దేశం వెనుకబాటు కారణం అయింది. సావిత్రిభాయి పూలే 1831వ సంవ త్సరం జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా నయగావ్‌ అనే గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించింది. తొమ్మిదో ఏటనే జ్యోతిబాపూలేని వివాహమాడింది. నిరక్ష రాశ్యురాలైన సావిత్రిబాయి పూలేకి తన భర్త జ్యోతిబాపూలే మొదటి గురువుగా విద్యాజ్ఞానం నేర్పి సామాజిక ఉద్యమ రాలిగా తీర్చిదిద్దాడు.1947 నాటికి తన భర్తతో కలిసి శూద్ర కులాల బాలికల కోసం పూణేలో మొట్టమొదటి బాలికా పాఠ శాలను ఆమె ప్రారంభించారు. న్యాయం, ప్రజాస్వామ్యం, స్త్రీ పురుష సమానత్వం అనే ఆదర్శాలు సావిత్రిబాయి పూలే జీవితంలో సహజ గుణాలుగా నిలిచిపోయాయి. ఆ రోజుల్లోనే స్త్రీ పురుష సమానత్వంపై సావిత్రిబాయి ప్రత్యేక చైతన్య కార్యక్రమాలను నిర్వహించింది. 19వ శతాబ్దంలో కుల వ్యతిరేక పురుషాధిక్య వ్యవస్థపై జరిగిన పోరాటాల్లో సావిత్రిబాయి పూలే ప్రత్యక్ష భాగస్వామురాలైంది.
1848లో మొట్టమొదటిసారిగా తొమ్మిది మంది విద్యా ర్థినీలతో ఒక బాలికా పాఠశాలను సావిత్రిబాయి తన స్నేహి తురాలు ఫాతిమా షేక్‌ ఇరువురు కలిసి సమర్థవంతంగా నడిపారు. ఆమె రోజు పాఠశాలకు వెళ్లేదారిలో అటకాయించి మట్టి, పేడ, రాళ్లు విసిరేవారు. వేధింపులకు గురి చేయడమే కాక నానా బూతులు తిట్టి అవమానించేవారు. అయిన ప్పటికీ తన లక్ష్యం కోసం ఆమె నిలిచింది. 1870 సంవత్సరంలో దేశవ్యాప్తంగా తీవ్ర కరువు పరి స్థితులు ఏర్పడ్డాయి ఆ సమయంలో అనాధ బాలికలు కరువు పీడిత పేద పిల్లల కోసం ఒక వసతి గృహాన్ని నడిపించారు.1890లో నవం బర్‌ 28న జ్యోతిబాపూలే మరణించగా, సావిత్రి తన భర్త చితికి నిప్పంటించారు. అనంతరం సత్యశోధక్‌ సమాజ్‌ మొత్తం బాధ్యతలు అన్నిటినీ ఆమె స్వయంగా నిర్వ హించారు. 1896లో కరువు సంభవించి నప్పుడు ప్రభుత్వంతో పోరాడి బాధితుల కోసం నిధులు మంజూరు చేయించారు ప్లేగు వ్యాధి సోకిన బాధితులకు ప్రత్యక్షంగా సేవలందిస్తున్న క్రమంలోనే ఆమెకు సైతం ప్లేగు వ్యాధి సోకింది. చివరికి 1897 మార్చి 10న సావిత్రిబాయి కన్నుమూశారు.
నాడు సావిత్రిబాయి అందరికీ చదువు కోసం అహర్ని శలు తపిస్తే, నేటి పాలకులు కొనుక్కోగలిగిన కొందరికే చదువు అందించే బాధ్యత నిర్వహిస్తున్నారు. విద్యార్థుల భవి ష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందని చెప్పిన కొఠారి కమిషన్‌ సిఫారసులను పాలకులు పట్టించుకోవడం లేదు కాసులు ఉన్నవారికి కార్పొరేట్‌ విద్య, కటిక దరిద్రం అనుభవిస్తున్న వారికి ప్రభుత్వ బడులలో నాసిరకమైన విద్యను అందిస్తున్న దుస్థితి నెలకొంది. విద్యా వైద్యం ఎట్టి పరిస్థితులలో ప్రయివేట్‌ కార్పొరేట్‌ శక్తుల చేతుల్లో ఉండ కూడదని ఆ రెండు ఎల్లప్పుడు ప్రభుత్వ సంక్షేమ రంగంలో మాత్రమే ఉండాలని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసా హెబ్‌ అంబేద్కర్‌ మనకు నొక్కి చెప్పారు. కానీ నేడు జరుగు తున్నది ఏమిటి? అంబేద్కర్‌ ఆలోచనలు, సావిత్రిబాయి పూలే ఆచరణ పద్ధతిని నేటి పాలకులు తుంగలో తొక్కు తున్నారు. ఉన్నత విద్యను ఉన్నత వర్గాలకే కట్టబెట్టే ప్రయ త్నంలో భాగంగా యూనివర్సిటీలను ప్రయివేటు కార్పొరేట్‌ శక్తులకు కట్టబెడుతున్నారు. శాస్త్ర, సాంకేతిక రంగం పురోభివృద్ధి చెందుతున్న నేటి ఆధునిక యుగంలో సైతం విద్యా రంగంలో మనువాద మత చాందస భావాలను జొప్పి స్తున్నారు మూడవిశ్వాసాలు, అశాస్త్రీయ భావాలు అబద్దా లను ఆయుధాలుగా వాడుకొని కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ విద్యారంగాన్ని పూర్తిస్థాయిలో కలుషితం చేస్తు న్నది. చరిత్ర సామాజిక శాస్త్రాలను సమాధి చేస్తోంది. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పాఠ్యాంశాలను రూపొం దిస్తుంది ఎన్సీఈఆర్టీలో మత ఉన్మాదం నింపుకున్న వారితోనే పాఠ్యాంశాలను తయారు చేయి స్తోంది. లౌకిక విలువలు మత సామరస్యం సమాఖ్యస్ఫూర్తి వంటి రాజ్యాంగ మార్గదర్శకా లను మట్టిలో పాతి పెడుతోంది. ప్రజల్లో రోజురోజుకీ పెరుగుతున్న అసంతృప్తిని పక్కదారి పట్టించడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. నిరుద్యో గులు తమ ఉపాధి గురించి మాట్లాడ కుండా దేశం సరిహద్దు విషయాలు పక్క దేశంపై పగ పెంచుకునే విషయాలు, మనోభావాల పేరిట యువతరాన్ని పక్కదారి పట్టిస్తోంది. నిరుద్యోగం ఉపాధి లేమి వ్యవసాయ సంక్షోభం కార్మికుల కనీస వేతనాల లేమి జీఎస్టీ పెద్దనోట్ల రద్దు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టం నిర్వీర్యం వంటి అనేక సమస్యల నుండి ప్రజల దష్టిని మళ్లి స్తోంది. గతంలో రాంనాథ్‌ కోవింద్‌ను అయోధ్య గుడిలో పలికి అనుమతించలేదు. నేడు ద్రౌపది ముర్మూ అయోధ్య రామమందిర భూమి పూజకు ఒక గిరిజన వితంతువు అని ఆహ్వానించలేదు. అత్యున్నత అతిథులకే ఈ కాలంలో జరిగిన వివక్షలను దేశమంతా కళ్లారా చూసింది.
సావిత్రిబాయి కాలంలో శూద్రులు అస్పృశ్యులు మహి ళలకు చదువును నిరాకరిస్తే, నేటి పాలకులు ప్రయివేటు యూనివర్సిటీలు, విద్యాసంస్థలు నెలకొల్పి పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారు. రాష్ట్రంలో 86 కుల దుర హంకార హత్యలు జరిగాయి. వీడిసీల పేరిట దళితులు, గిరి జనులు బలహీన వర్గాలను సాంఘిక బహిష్కరణలు చేస్తున్న దుస్థితిని నెలకొంది. దళితులపై దాడులు దౌర్జన్యాలు నేటికీ కొనసాగడం వెనకాల ఉన్న ఆర్థిక వెనుకబాటుతనం, సామాజిక అణి చివేతలు కొట్టొచ్చినట్టు కనిపి స్తున్నాయి. సావిత్రి బాయి పూలే లక్ష్యాలు ఆశయాల్ని ఆచరించాలనుకునే ప్రతి ఒక్కరూ ఆమె జీవితాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. పేపర్‌ మీద గీసిన బొమ్మను చూపించి అందరికీ చదువు రావడానికి సర స్వతి దేవి కారణమంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్లు సాగిస్తున్న ప్రచారాన్ని ప్రతి ఘటించాలి దేశానికి మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయిని సావిత్రిబాయి పూలేనని చాటి చెప్పాలి. సావిత్రిబాయి కంటే ముందు శూద్రులు, అస్పృశ్యులు మహిళలు చదువుకు దూరంగా ఉన్న దుస్థితి. సావిత్రి బాయి పూలే లక్ష్యాలు, ఆశయాలు పాలకులు ఆచరించాల నుకుంటే అందరికీ సమాన విద్యను అందించే విధంగా ప్రయత్నాలు సాగించాలి. సావిత్రిబాయి పూలే ఏ సామాజిక విప్లవాత్మక మార్పుల కోసం పరితపించారో ఆ లక్ష్యం నేటికీ నెరవేర్చబడలేదు. ఆమె చూపిన మార్గం ప్రజాస్వామిక వాదులకు ఒక సవాలు గానే మిగిలింది.
(నేడు సావిత్రి బాయి పూలే 193వ జయంతి)
టీ స్కైలాబ్‌ బాబు
9177 549646