మహిళలకు తగిన రక్షణ ఉన్నప్పుడే సావిత్రిబాయి పూలే ఆశయం నెరవేరుతుంది

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు
నవతెలంగాణ కంఠేశ్వర్: మహిళలకు తగిన రక్షణ ఉన్నప్పుడే సావిత్రిబాయి పూలే ఆశయం నెరవేరుతుంది అని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు తెలిపారు. ఈ మేరకు బుధవారము సీపీఐ(ఎం) కార్యాలయంలో సావిత్రిబాయి పూలే 193వ జయంతిని నిర్వహించటం జరిగింది. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా పనిచేసి సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు దురాచారాలను రూపుమాపటానికి భారతదేశంలో ఉన్న సామాజిక వివక్షత మనస్మృతి ఆధారంగా మహిళలను రెండవ తరగతి పౌరులుగా గుర్తించే విధానాలను ఖండిస్తూలలో చైతన్యం తీసుకురావడానికి బాలికలకు మహిళలకువిద్యా బోధనను అందిస్తూ సమ సమాజం కోసం పరితపించారని ఆయన అన్నారు.
నేటి పాలకులు మహిళలకు తగిన రక్షణ గౌరవం లేకుండా వివక్షతను ప్రదర్శిస్తున్నారని మనుస్మృతి ఆధారంగా నేటి భారత పాలకులు తమ దానాలను కొనసాగించటం మూలంగా మహిళలపై నా దాడులు దౌర్జన్యాలు అఘాయిత్యాలు నేటికీ కొనసాగుతున్నాయని వీటికి వ్యతిరేకంగా మహిళలందరూ ఐక్యంగా తమ హక్కులను కాపాడుకోవడం కోసం నిలదీసినప్పుడే సావిత్రిబాయి పూలే కు నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, బి అనిల్, విగ్నేష్, ఐద్వా నాయకురాలు అనిత తదితరులు పాల్గొన్నారు.