సరిహద్దుల్లో నిరంతర తనిఖీలు చేపట్టాలి: సాయన్ దేబర్మ

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో వ్యయ పరిశీలన పకడ్బoదిగా చేపట్టాలని 14- భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు సాయన్ దెబర్మ సూచించారు.శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని తుంగతుర్తి, నకిరకల్  అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని విధులు నిర్వహిస్తున్న ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి, జీఎస్ టి, వివిటి, జీఎస్ టి, సహాయ వ్యయ పరిశీలకులతో ఏర్పాటు చేసిన సమావేశం లో జిల్లాలో కలెక్టర్ ఎస్ వెంకట్రావు, ఎస్ పి రాహుల్ హెగ్డే లతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్బంగా వ్యయ పరిశీలకులు మాట్లాడుతూ ఎన్నికలలో అకౌంటింగ్ విధానం, సీజర్, జిఎస్ టి,అలాగే ఎక్సైజ్ కేసులు ఎక్కువ గా నమోదు చేయాలని సూచించారు.సరిహద్దు చెక్ పోస్ట్ లలో నియమించిన బృందాలు నిరంతరం నిఘా ఉంచి ప్రతి వాహనం కూడ తనిఖీ చేపట్టాలని సూచించారు.
పెయిడ్ ఐటమ్స్ కి రేట్ కార్డు ప్రకారం ఖర్చు వ్యయా ని అభ్యర్థి ఖాతాలో జమ చేయాలని అలాగే ప్రకటనలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని లేని యెడల ఖర్చు వ్యయాన్ని జమ చేయాలని సూచించారు.తదుపరి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలో ఆరు మండలాలో గల 213 పోలింగ్ కేంద్రాలలో 2,59,096 మంది ఓటర్లు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయని అన్నారు. అదే విధంగా సూర్యాపేట జిల్లా లోని తుంగతుర్తి నియోజకవర్గం లో గల ఆరు మండలాలో 31 సమస్యత్మాక ప్రాంతాలలో 39 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వివరించారు. అలాగే తుంగతుర్తి నియోజకవర్గం లో  సర్వీస్ ఓటర్లు 139, ఎన్ ఆర్ ఐ ఓటర్లు 8,వికలాంగుల ఓటర్లు 3797 మంది ఉన్నారని వివరించారు. తుంగతుర్తి నియోజకవర్గం లో నియమించిన బృందాలు తనిఖీలు చేపట్టి నగదు, బంగారం, ఇతర వస్తువులు సీజ్ చేస్తున్నట్లు వివరించారు.తదుపరి జిల్లా ఎస్ పి రాహుల్ హెగ్డే మాట్లాడుతూ తుంగతుర్తి పరిధిలో మూడు చెక్ పోస్ట్ లు ఉన్నాయని,22 రూట్స్ గా విభజించి గట్టి నిఘా పెంచమని ఇప్పటి వరకు 25 లక్షల రూపాయలు అలాగే 31 లక్ష రూపాయల విలువ గల లిక్కర్ 663 లీటర్లు సీజ్ చేయటం జరిగిందని తెలిపారు. సమస్యత్మాక ప్రాంతాలలో గట్టి నిఘా పెంచామని అలాగే  రెండు కేంద్ర బలగాలు నిరంతరం తనిఖీలు చేస్తున్నారని తెలిపారు.
ఈ సందర్బంగా నకిరేకల్ ఎ ఆర్ ఒ పూర్ణచందర్ రావు మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం లోని నకిరేకల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో అన్ని బృందాలు  నిరంతరం పనిచేస్తున్నామని అన్నారు.  సమస్యత్మాక ప్రాంతాలపై గట్టి నిఘా ఉంచామని ఎన్నికల సిబ్బందికి, అధికారులకు ఫారం 12 డి అందజేశామని తెలిపారు.కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్, డిజిటల్ బ్యాంకింగ్ ట్రాన్సక్షన్స్ సెంటర్, ఎలక్షన్ ఇంటిగ్రెటెడ్ కంట్రోల్ రూమ్ లను జిల్లా కలెక్టర్ తో కలిసి పరిశీలించారు.ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్లు సి హెచ్ ప్రియాంక, బి ఎస్ లత, ట్రైనీ ఐ పి ఎస్ రాజేష్ మీనా, అదనపు ఎస్ పి నాగేశ్వరావు, ఎల్ డి ఎం బాపూజీ, ఏం సి సి నోడల్ ఆపిసర్ సతీష్ కుమార్, అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ నోడల్ ఆపిసర్ పద్మ,తహసీల్దార్ లు,బ్యాంక్ అధికారులు, పోస్టల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.