– చేవెళ్ల ఎంపీపీ మల్గారి విజయలక్ష్మిరమణారెడ్డి
నవతెలంగాణ-చేవెళ్ల
భూస్వాములకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి పండుగల సాయన్న అని చేవెళ్ల ఎంపీపీ మల్గారి విజయలక్ష్మి రమణారెడ్డి, చేవెళ్ల పీఎసీఎస్ చైర్మెన్ దేవర వెంకటరెడ్డి, చేవెళ్ల గ్రామ సర్పంచ్ బండారు శైలజ అగిరెడ్డి రెడ్డి అన్నారు. బుధవారం చేవెళ్ల మండల కేంద్రంలో ముదిరాజ్‌ల ఆరాధ్య దైవం పండుగల సాయన్న విగ్రహ ఏర్పాటుకు పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూస్వాములకు, రజాకార్లకు వ్యతి రేకంగా పోరాడి ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన మహావీరుడిగా చరిత్రకు ఎక్కారని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో కనుమరుగైన వీరుడి చరిత్ర ఉందంటే అది పండుగ సాయన్నదే అని తెలిపారు. ఆయన నిజాం పాలనకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలను, చరిత్రను కనుమరుగు చేశారని తెలిపారు. 1860లో రజాకార్ల రాజ్యం కొన సాగు తుండేదని, అప్పట్లో రజాకార్లు, భూస్వాములను చెప్పుచేతుల్లో పెట్టుకుని పాలనచేస్తుండే వారనీ గుర్తు చేశారు. ఈ తరుణంలో భూస్వాములు పండుగ సాయన్న కుటుంబం భూమిని ఆక్రమించు కుంటే, తిరగబడ్డ కుటుంబాన్ని వేధించేవారని తెలిపారు. మొదటి సారి సాయన్న భూస్వాములను పొలంలో నాగళ్లు కట్టిన సమయంలో వారిని ఎదురించిన పోరాడిన మహావీరుడని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ముదిరాజుల సంఘం అధ్యక్షుడు ఊరడి నర్సింలు, ఉపాధ్యక్షులు సును గంటి శ్రీకాంత్, బంటిగారి గణేష్, కావలి వెంకటేశ్, బంటు గోపాల్, ఊరడి వెంకటేష్, ప్రధాన కార్య దర్శులు తెలుగు రాజశేఖర్, ఊరడి రాంప్రసాద్, కావలి చామంతి శివరాజ్, సంస్కతిక కార్యదర్శి కావలి మల్లేష్, కావలి క్రిష్ణ, కార్యవర్గ సభ్యులు కావలి శివకుమార్, కావలి మహేందర్, ప్రభు, యువజన సంఘం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.