గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను అందుకున్న SBI లైఫ్

నవతెలంగాణ- ఢీల్లి: దేశంలో అత్యంత విశ్వసనీయమైన ప్రైవేట్ జీవిత భీమా కంపెనీలలో ఒకటైన SBI లైఫ్ ఇన్సూరెన్స్, #IndiaKaPassionPledge ప్రచారాన్ని ప్రారంభించడానికి కొత్త AI-టెక్నాలజీ, ChatGPTని ఉపయోగించుకుంది మరియు ‘ మోస్ట్ ప్లెడ్జెస్ రిసీవ్డ్ ఫర్ ఏ పాషన్ కాంపెయిన్ ఇన్ 24 హావర్స్ ( 24 గంటల్లో పాషన్ ప్రచారం కోసం అత్యధిక ప్రతిజ్ఞల అందుకోవటం ) కోసం గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను సృష్టించింది. ఈ ప్రచారంలో దేశవ్యాప్తంగా ప్రజలు భాగస్వామ్యమయ్యారు, ఇక్కడ వినియోగదారులు తమ కుటుంబ ఆర్థిక అవసరాలను చూసుకుంటూ, ఏకకాలంలో తమ అభిరుచిని సైతం కొనసాగించేందుకు ఆన్‌లైన్‌లో ప్రతిజ్ఞ తీసుకున్నారు. వినియోగదారులను వారి అభిరుచిని కొనసాగించేలా ప్రోత్సహించే ప్రయత్నంలో, SBI లైఫ్ AI-ప్రాంప్ట్ ప్లెడ్జిథాన్ మైక్రోసైట్‌ను ప్రారంభించింది, ఇది ఆర్థిక సేవల రంగంలో మొట్టమొదటిసారిగా వ్యక్తిగతీకరించిన ప్రతిజ్ఞలను రూపొందించడానికి ChatGPTని ఉపయోగించింది. వినియోగదారు వారి పేరు, లింగం, సంప్రదింపు నంబర్ మరియు వ్యక్తిగత అభిరుచి వంటి ప్రాథమిక సమాచారాన్ని ప్లెడ్జి జనరేషన్ ప్రాంప్ట్‌లో నమోదు చేసిన తర్వాత మైక్రోసైట్ వినియోగదారులను వ్యక్తిగతీకరించిన ప్రతిజ్ఞను రూపొందించడానికి అనుమతించింది. వినియోగదారులు తమకి అనుకూలీకరించిన ప్రతిజ్ఞను స్వీకరించారు, అది తర్వాత ఆడియో ఫైల్‌గా మార్చబడింది. బ్రాండ్ యొక్క మ్యూజికల్ లోగో (MOGO)తో పాటు టెక్స్ట్-టు-స్పీచ్ ఫీచర్ ద్వారా టెక్స్ట్ తిరిగి చదవబడింది. ఈ కార్యక్రమం పై SBI లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాండ్, కార్పొరేట్ కమ్యూనికేషన్ & సిఎస్ఆర్ చీఫ్, శ్రీ రవీంద్ర శర్మ మాట్లాడుతూ, “కొత్త సాంకేతికత ల ఆగమనం నేటి వినియోగదారుల వైఖరి మరియు ప్రవర్తనకు పునరాకృతి అందిస్తుంది. వారు మునుపటి కంటే ఎక్కువగా ఇప్పుడు కనెక్ట్ అవుతున్నారు. కొత్త-తరపు వినియోగదారుడు, కొత్త సాంకేతిక ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నారు మరియు తమ ప్రయాణంలో సైతం డిజిటల్‌గా ఇంటరాక్ట్ కావడం చేస్తున్నారు. SBI లైఫ్ ఇన్సూరెన్స్‌ వద్ద మేము చేసే ప్రతి పనిలో ఆవిష్కరణ ఎల్లప్పుడూ ఉంటుంది. సాంకేతికతకు సంబంధించి నేటి వినియోగదారు యొక్క ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న ప్రవర్తన & ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, మేము వారితో కనెక్ట్ అయ్యేందుకు & సమ్మిళిత వినియోగదారు అనుభవాన్ని అందించడానికి AI- నేతృత్వంలోని ChatGPTని ఉపయోగించాము. తమ ప్రియమైన వారి ఆర్థిక అవసరాలను చూసుకుంటూ, వారి కలలపై రాజీ పడకుండా స్వీయ-కాంక్షలను నెరవేర్చడానికి ప్రతిజ్ఞ చేయమని వారిని ప్రోత్సహించడం ద్వారా వ్యక్తులలో ప్రవర్తనా మార్పును తీసుకురావడానికి మేము #IndiaKaPassionPledge ప్రచారాన్ని ప్రారంభించాము. దేశం నలుమూలల నుండి భారీ సంఖ్యలో వినియోగదారులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు . మా ప్రధాన బ్రాండ్ ఉద్దేశ్యంతో ప్రతిధ్వనించే లా ప్రస్తుత తమ బాధ్యతలను చూసుకోవడం ఎంత ముఖ్యమో, తమను తాము విముక్తి చేసుకోవడం కూడా అంతే ముఖ్యమని ఈ రోజు వినియోగదారులు విశ్వసిస్తున్నారని ఇది చూపిస్తుంది. వ్యక్తులు తమ ఆకాంక్షలను కొనసాగించాలని మరియు దానిని నిజం చేయడంలో ముందడుగు వేస్తారని మేము ఆశిస్తున్నాము.” అని అన్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ , అధికారిక న్యాయనిర్ణేత,జోవాన్ బ్రెంట్ మాట్లాడుతూ “24-గంటల్లో పాషన్ క్యాంపెయిన్ కోసం అత్యధిక ప్రతిజ్ఞల ను స్వీకరించటం కోసం చేసిన ఈ ప్రయత్నం SBI లైఫ్ ఇన్సూరెన్స్‌కు మరియు వారి ప్రతిజ్ఞలను సమర్పించిన ఉత్సాహంతో నిండిన భాగస్వాములందరికీ గొప్ప విజయం. వాస్తవాల సమీక్ష సమయంలో అనేక సాంకేతిక అవసరాలు మరియు డాటా యొక్క సమగ్ర పరిశోధనలతో రికార్డు సెట్ చేయడం అంత తేలికైన అంశం కాదు. ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను సెట్ చేసే ప్రక్రియలో ప్రజలు తమ అభిరుచుల పరంగా ప్రోత్సహించబడటం స్ఫూర్తిదాయకం…” అని అన్నారు. డెంట్సు(Dentsu) క్రియేటివ్, డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ ప్రెసిడెంట్ సాహిల్ షా మాట్లాడుతూ , “SBI లైఫ్ యొక్క #IndiaKaPassionPledge ప్రచారంలో AI సాంకేతికత, ప్రత్యేకంగా ChatGPT యొక్క ఏకీకరణ గేమ్-ఛేంజర్‌గా మారింది. ఇది వినియోగదారులతో మరింత వ్యక్తిగతీకరించిన స్థాయిలో చర్చకు అనుమతించింది, వారి వ్యక్తిగత అభిరుచులతో ప్రతిధ్వనించే అనుకూలీకరించిన ప్రతిజ్ఞలను రూపొందించింది. చాట్‌జిపిటిని ఉపయోగించడం వల్ల కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సృష్టించడం మాత్రమే కాకుండా, కొత్త ఆవిష్కరణలు మరియు కస్టమర్-సెంట్రిసిటీ పట్ల ఎస్‌బిఐ లైఫ్ యొక్క నిబద్ధతను బలోపేతం చేసింది..” అని అన్నారు