టాప్‌ కార్పొరేట్లతో ఎస్‌బీఐ ఎండీ భేటీ

SBI MD met with top corporatesహైదరాబాద్‌ : ప్రభుత్వ రంగంలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ (కార్పొరేట్‌ బ్యాకింగ్‌, సబ్సీడరీస్‌) అశ్వినీ కుమార్‌ తివారీ బుధవారం ఆ బ్యాంక్‌ హైదరాబాద్‌ సర్కిల్‌ను సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన పలువురు టాప్‌ కార్పొరేట్‌ క్లయింట్లతో భేటీ అయ్యారు. పారిశ్రామిక వర్గాలకు బ్యాంక్‌ అందిస్తున్న సేవలపై వివరించారు. అనంతరం కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)లో భాగంగా నగరంలోని శంకర గురుకుల్‌ వేద పాఠశాల (ఎస్‌ఎస్‌జీవీపీ) చారిటేబుల్‌ ట్రస్ట్‌కు 41 కిలోవాట్‌ సోలార్‌ రూప్‌టాప్‌ గ్రిడ్‌ను ఏర్పాటు చేసుకోవడానికి రూ.18 లక్షల విలువ చేసే చెక్కును ఆ ట్రస్ట్‌ నిర్వాహకులకు అందజేశారు. శామీర్‌పేట్‌లోని ఆ పాఠశాలలో వేదాలు నేర్చుకునే 150 మంది విద్యార్థులు ఉన్నారని ఆ వర్గాలు తెలిపాయి.