ఎస్సీ బాలుర కళాశాల వసతి గృహాన్ని మంజూరు చేయాలి

– ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జేరిపోతుల జనార్దన్
నవతెలంగాణ –  హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ లో ఎస్సి బాలుర కళాశాల వసతి గృహాన్ని మంజూరు చేయాలని ఏఐఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి జేరిపోతుల జనార్ధన్,జిల్లా అధ్యక్షుడు సంగెం మధు తో కలిసి శనివారం హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  హుస్నాబాద్ లో ఎస్సి బాలుర కళాశాల వసతి గృహం లేక ఎస్సీ విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. హుస్నాబాద్ లో 13 ప్రభుత్వ ,ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయని, ఆ కళాశాలల్లో సుమారుగా 350 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. వసతి గృహం లేక బీసీ,ఎస్టీ హాస్టల్లో ఎస్సిలకు సరిపడ సీట్లు లేక విద్యార్థులు రోజు దూర ప్రాంతాల నుండి కాలేజి రావడం పోవడం జరుగుతుందని అన్నారు. కళాశాల వసతి గృహానికి కావాల్సిన ప్రభుత్వ భవనం సిద్ధంగా ఉందని ,విద్యార్థుల బాధలను దృష్టిలో ఉంచుకుని హుస్నాబాద్ లో హాస్టల్ విషయంలో తమ అధికారులచే విచారణ చేసి ఎస్సీ బాలుర కళాశాల వసతి గృహాన్ని మంజూరు చేయాలని వినతిపత్రంలో  కోరారు.