
గత 30 సంవత్సరాల ఉద్యమం నేడు ఫలించి ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీ గారి భూమయ్య అన్నారు. శుక్రవారం రెంజల్ మండలం బోర్గం గ్రామంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి, అన్న బహు సాటి విగ్రహాలకు పూలమాలలు వేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము కన్న కలలు నేడు నిజమయ్యాయని, గురువారం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ సానుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మేక సంతోష్, ఎమ్మార్పీఎస్ స్థానిక నాయకులు, యువత తదితరులు పాల్గొన్నారు.