
నవ తెలంగాణ-గోవిందరావుపేట
మాదిగ జేఏసీ పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ అని మాదిగ జేఏసీ ములుగు జిల్లా అధ్యక్షులు అంబాల మురళి అన్నారు. గురువారం మండల కేంద్రంలో మురళి పాత్రికేయులతో మాట్లాడారు.మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ పోరాటం డాక్టర్ పిడమర్తి రవి మాదిగ జాతి కొరకు అలుపెరుగని పోరాటం చేసి అనేక కేసులను ఎదుర్కొని మాదిగ జాతి బతుకులు మారాలని అకుంఠిత దీక్షతో దశాబ్దాల కాలంగా మాదిగల ఐక్యం చేస్తూ మాదిగ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన పోరాట యోధుడు దళిత ముద్దుబిడ్డ గల్లి నుంచి ఢిల్లీ దాకా మాదిగ పోరాట ఉద్యమాన్ని సాగించిన ఉస్మానియా ఉద్యమ కెరటం మాదిగ జాతి కోసం అహర్నిశలు కృషి చేసి తన జీవితాన్ని మాదిగ ఉద్యమానికి అంకితం చేసి వర్గీకరణ సాధించేవరకు తన పోరాటాన్ని కొనసాగించి వర్గీకరణ సాధనకు దిక్సూచి అయినారు ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పు మాదిగ జాతి అంతా హర్షం వ్యక్తం చేసింది మాదిగ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ మీ మాదిగ జేఏసీ ములుగు జిల్లా అధ్యక్షులు అంబాల మురళి ఒక పత్రిక ప్రకటనలో వ్యక్తిగత చేశారు