
వర్గీకరణ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి-మాల మహానాడు, సంఘాల నాయకులు ఎస్సీ వర్గీకరణ నియోజకవర్గం కమిటీ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, ముధోల్ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక సమితి అధ్యక్షులు ప్రకాష్, అడ్వైజర్ ప్రభాకర్ గాడ్ పాలే పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన ముధోల్లో సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సి వర్గీకరణ పోరాట సమితి తాలూకా జనరల్ సెక్రటరీ అధ్యక్షుడు విఠ్ఠల్ కాంబ్లె మాట్లాడారు దేశంలోని మనువాద అగ్రకుల పార్టీలన్నీ వారి అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఎస్సీ-ఎస్టీలను విభజించి బలహీనపరిచేందుకు జరిగిన కుట్రలో భాగమే సమ అని ఆరోపించారు. ఆర్టికల్ 341కి విరుద్ధంగా రిజర్వేషన్లు రాజకీయ ప్రమేయానికి వీలు కల్పిస్తూ రాష్ట్రాలకు అధికారం కల్పించిందని విమర్శించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని దీనిపై అప్పీల్ చేస్తామన్నారు. అనంతరం అంబేద్కర్ చౌక్ లో ఉన్న గౌతం బౌద్ధునికి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ చౌక్ నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహశీల్దార్ శ్రీకాంత్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక సమితి నియోజకవర్గ ఉపాధ్యక్షులు మగ్గిడి దిగంబర్ చంద్రశేఖర్ గాయక్వవాడ్, ట్రెజరర్ ధర్మాజీ చందనే, ఆర్గనైజర్ రమేష్ బాబు వాగ్మరే, జనరల్ సెక్రెటరీ దండు సాయినాథ్, వివిధ గ్రామాల మాల మహానాడు సంఘాల నాయకులు, భీమ్ ఆర్మీ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు, తదితరులు, పాల్గొన్నారు.