ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కోకన్వీనర్ తాళ్లపల్లి రవి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో గల మాల మహానాడు కార్యాలయం లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నల్లగొండ జిల్లా చైర్మన్ లకుమాల మధుబాబు అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ తీర్పును రద్దు చేసే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 14 న నల్లగొండ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్ లో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి ఎస్సీ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర చైర్మన్ జి. చెన్నయ్య హాజరవుతున్నట్లు తెలిపారు. కావున ఈ కార్యక్రమానికి మాలలు, మాల ఉద్యోగస్తులు, యువకులు, అంబేద్కర్ వాదులు, మహిళా నాయకులు, మాల ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా, డివిజన్, నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎన్నమల్లఅనిల్, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ నాగటి జోసఫ్, ఎస్సీ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కో కన్వీనర్లు చింతపల్లి బాలకృష్ణ, నామ చక్రవర్తి, మాల మహానాడు నల్గొండ జిల్లా ప్రచార కార్యదర్శి అన్నిమల్ల ప్రసాద్, అన్నిమల్ల లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
నూతన కమిటీ..
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నల్గొండ నియోజకవర్గ కన్వీనర్ గా రొయ్య కిరణ్ కుమార్, నకిరేకల్ నియోజకవర్గ కన్వీనర్ గా ముడుసు బిక్షం, మునుగోడు నియోజకవర్గ కన్వీనర్ గా రెడ్డి మల్ల బాబు ను నియమించారు.