నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వాలని ఆదేశాల సారాంశంగా సోమవారం స్థానిక యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కి రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు చిలుక మారి గణేష్ మాదిగ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదిగలు, మూడు శతాబ్దాలుగా సుదీర్ఘమైన అనేక రాజకీయ పార్టీల మద్దతుతో ప్రభుత్వాలపై సుదీర్ఘమైన పోరాటం చేసినప్పటికీ వర్గీకరణ, అమలు కాకపోవడం చింతిస్తూ ఈ బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాల క్రితం బీజేపీ పార్టీ ఎన్నికల ప్రణాళికలో భాగంగా వర్గీకరణ 100 రోజుల్లో మా ప్రభుత్వం వస్తే చట్టబద్ధత చేస్తామని, మాదిగలకు అనేకమైన సభలలో వాగ్దానం చేశారని, అందుకు మొన్నటికి మొన్న మాదిగలు హైదరాబాదులో ఏర్పాటు చేసిన సభలో ప్రధానమంత్రి మోడీ మీ సమస్యను వెంటనే పూర్తి చేస్తానని సభల్లో పేర్కొన్నారని, నేటి నుండి జరిగే పార్లమెంటు సమావేశాల్లో వర్గీకరణకు చట్టబద్ధత చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ చింతల శంకర్, కొండాపురం శ్రీనివాస్, సిల్వర్ అశోక్, కోట సామ్దాస్, కాశపాక ఎల్లయ్య , పల్లెర్ల స్వామి, చింతల నరేష్, ఇటుకల ఇస్తారు లు పాల్గొన్నారు.