నవతెలంగాణ – మల్హర్ రావు
ఎస్సి వర్గీకరణ ఆపే దమ్ము ఎవరికి లేదని,ఎస్సి వర్గీకరణ సాధించుకొని తీరుతామని ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు. గురువారం మండల కేంద్రమైన తాడిచెర్లలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు, జిల్లా కార్యదర్శి కేసారపు నరేష్ మాదిగ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకులపై సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం ఎస్సీ వర్గీకరణ జరుగుతేనే ఎస్సీలలో ఉన్న అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. మాదిగల మహాత్ముడు మాదిగల ఆత్మగౌరవం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాలుగా పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ కొన్ని వ్యతిరేక శక్తులు ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తప్పుడు తీర్పు ఇచ్చిందని, మనువాదస్ఫూర్తితో మాట్లాడుతున్న వ్యక్తులు వారి రాజకీయ స్వలాభాల కోసం అమాయకమైన మాలలను రెచ్చగొట్టడం అనేది సరైన పద్ధతి కాదని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకులను ఈ భారత సమాజం ద్రోహులుగానే చూస్తుందన్నారు.మందకృష్ణ మాదిగను విమర్శిస్తే, మాదిగ ఉపకులాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు చూస్తూ ఊరుకోరన్నారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తాండ్ర మల్లేష్ మాదిగ ,ఎమ్మార్పీఎస్ నాయకులు కేసారపు చంద్రయ్య మాదిగ పులిగంటి నర్సయ్య మాదిగ,మండల ప్రధాన కార్యదర్శి తాండ్ర దినేష్ మాదిగ, యూత్ మండల ప్రధాన కార్యదర్శి ఇందారపు అరుణ్ మాదిగ,ఇందారపు కుమార్ మాదిగ, తుంగపల్లి సాత్విక్ మాదిగ, ఇందాక శ్రీను మాదిగ,ఇందారపు రఘువరన్ మాదిగ, కొలుగూరి సందీప్ మాదిగ, కేసారపు అరుణ్ మాదిగ,ఇందారపు చరణ్ మాదిగ,బూడిద సుదర్శన్ మాదిగ,ఇందారపు గణేష్ మాదిగ పాల్గొన్నారు.