నవతెలంగాణ – ఆత్మకూరు
మండలంలోని పలు గ్రామాల్లో ఎస్సీ కాలనీలోని అంతర్గత రోడ్లు ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా దెబ్బతిని తీవ్రంగా బురదమయంగా అయ్యాయని ఆయా గ్రామ కార్యదర్శులకు చెప్పిన పట్టించుకోవడంలేదని ధర్మసమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు మైదం రవి మహారాజ్ అన్నారు. గుడేప్పాడ్ గ్రామంలో గత ప్రభుత్వం రెండు పడక గదుల ఇల్లు నిర్మానించింది. కానీ రోడ్డు నిర్మించడం మరిచింది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారులకు చెప్పిన కూడా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల కాలనీలపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని ఇప్పటికైనా వివక్ష వీడి అభివృద్ధి చేసే విధంగా కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆత్మకూరు గ్రామంలో జాతీయ రహదారి సమీపంలో ఉన్న కాలనీలకు రోడ్లు వేశారు కానీ ఎస్సీ కాలనీలో సిసి రోడ్లు మురుగుకలువలు అధ్వానంగా తయారై కాలనీవాసులు విష జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు. మండల ప్రత్యేక అధికారి ఎస్సీ కాలనీల పై శ్రద్ధ వహించాలని రవి డిమాండ్ చేశారు. లేదంటే దళితులు దళిత సంఘాలతో ధర్నాలు చేయడానికి అందరం సిద్ధంగా ఉన్నామన్నారు.