ఎస్సీ కార్పొరేషన్‌ లబ్దిదారులకు కుట్టుమిషన్లు అందజేత

– ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌ రెడ్డి
నవతెలంగాణ-ఆలేరుటౌన్‌/రూరల్‌
2018-19గాను ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఆలేరు మండలంలోని ఇద్దరు లబ్దిదారులకు రూ.50,000 విలువచేసే రెండు ఎంబ్రాయిడరీ కుట్టు మిషన్లను ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి అందజేశారు. శనివారం ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఎంపికైన పంగ సరిత (మందనపల్లి), చెవుల స్వరూప (కొలనుపాక)లకు ఎంబ్రాయిడరీ కుట్టుమిషన్లను శనివారం అందజేశారు.ఈ సందర్భంగా గుండాల, రాజపేట మండలాలకు చెందిన లబ్దిదారులకు రుణాలను అందజేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శ్యాంసుందర్‌రావు, ఎంపీడీవో జ్ఞాన ప్రకాష్‌, ఆయా మండలాలకు సంబంధించిన సర్పంచులు పాల్గొన్నారు.