పట్టణంలో ఎస్సీ గర్ల్స్ హాస్టల్ నిర్మాణం చేపట్టాలి..

– ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్
నవతెలంగాణ- ఆర్మూర్  :
పట్టణంలో ఎస్టి గర్ల్స్ హాస్టల్ నిర్మాణం చేయాల నీ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్ అన్నార. భారత విద్యార్థి ఫెడరేషన్ ( కన్వినింగ్ కమిటీ సమావేశం స్థానిక సంతోష్ నగర్ ఆఫీస్ కార్యాలయంలో శనివారం విలేకరుల నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పట్టణంలో ఎస్టీ గర్ల్స్ హాస్టల్ నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్టల్స్ ప్రారంభం అవుతున్న వేళ ఎస్టి విద్యార్థినీలకు ప్రత్యేక హాస్టల్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో నాణ్యత కలిగిన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని దాంతో పాటుగా ప్రభుత్వ పాఠశాలలను కళాశాలలను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు సందర్శించి సమస్యలను పరిష్కరించాలని  డిమాండ్ చేశారు. అదే విధంగా పెండింగ్ లో ఉన్న మెస్ చార్జీలను విడుదల చేయాలని అన్నారు. విద్య ప్రమాణాలను పెంచి విద్య రంగాన్ని అభివృధ్ధి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం లో  జిల్లా అధ్యక్షులు మహేష్,  ఆ డివిజన్ కన్వీనర్ పల్లపు శ్రావణ్ కుమార్, కో – కన్వీనర్ వర ప్రసాద్, విష్ణు, తదితర నాయకులు పాల్గొన్నారు.