నవతెలంగాణ-శంకరపట్నం : శంకరపట్నం మండల పరిధిలోని అంబాల పూర్, గ్రామానికి చెందిన గుడిసె ఎల్లస్వామి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిట్ కేసు నమోదు చేసినట్లు,కేశవపట్నం ఎస్సై పాకాల లక్ష్మారెడ్డి,బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ,గతంలో హుజురాబాద్ కు చెందిన బాధితురాలు రజిత దగ్గర అప్పు తీసుకొన్న డబ్బులు తిరిగి చెల్లించకుండా, ఎల్లస్వామి,ఇష్టం వచ్చినట్లు, కులం పేరుతో దూషిస్తూ,నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి హుజురాబాద్ ఎ సి పి వెంకట్ రెడ్డి, దర్యాప్తు చేస్తున్నట్లు,దర్యాప్తు లో భాగంగా ఎల్లస్వామిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించినట్లు, ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు.