– అంబేద్కర్ సంఘ మండలాధ్యక్షుడు భరత్ కుమార్..
నవతెలంగాణ – జన్నారం
కులం పేరుతో దూషించిన వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అంబేద్కర్ సంఘం మండలాధ్యక్షుడు సిటిమల భరత్ కుమార్ అన్నారు. బుధవారం జన్నారం ప్రెస్ క్లబ్ లో పత్రికా విలేకరులతో మాట్లాడుతూ.. లక్షేట్టిపేట మండలం అన్మంత్ పల్లి గ్రామానికి చెందిన అవునూరి రాజయ్యను చందారం గ్రామానికి చెందిన మిల్కూరి మల్లేష్ రంగపేట్ శివారు అక్రమంగా అవునూరు రాజయ్య భూమిని కబ్జా చేసి కొట్టీ కులం పేరుతో దూషించాడన్నారు. మిల్కురి మల్లేష్ ను చట్టం ప్రకారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అరెస్ట్ చేసి శిక్షించి బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేకుంటే అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంగం జిల్లా నాయకులు తాళ్లపల్లి రాజేశ్వర్ మామిడిపల్లి ఇందయ్య, దూమల్ల రమేష్, జునుగురి మల్లయ్య ఎర్రగడ్డ దత్తు తదితరులు పాల్గొన్నారు.