హవర్గా గ్రామంలో ఎస్సీ, ఎస్టి కేసు విచారణ.. 

SC, ST case investigation in Hawarga village..– యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి: ఏఎస్పీ అవినాష్ కుమార్
నవతెలంగాణ – లోకేశ్వరం
మండలంలోని హవర్గ గ్రామానికి చెందిన పర్స భోజన్నకు అదే గ్రామానికి చెందిన లక్ష్మణ్కు రెండేళ్లుగా భూతగాదాలు ఉండగా జూన్ 24 న వ్యవసాయ పనుల నిమిత్తం భోజన్న చేనుకు వెళ్లగా అప్పటికే లక్ష్మణ్, అతని భార్య గోదావరి అక్కడ ఉన్నారు. ఇరువురి మధ్య వాగ్వాదం జరగగా లక్ష్మణ్ చేతిలో ఉన్న పారతో భోజన్న తలపై కొట్టడంతో గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు నిర్మల్ ప్రభుత్వ ఆస్పతికి తరలించగా అక్కడ చికిత్స పొందుతు మృతి చెందారు. అప్పటి భైంసా ఏఎస్పీ కాంతిలాల్పాటిల్, ముధోల్ సీఐ మల్లేశ్, అప్పటి లోకేశ్వరం ఎస్సై మోహ న్రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు లక్ష్మణ్, గోదావ రిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయమై భైంసా పట్టణానికి ఇటీవల కొత్తగా వచ్చిన ఏఎస్పీ అవినాష్ కుమార్ సోమవారం గ్రామంలో ఇరువర్గలతో ఎస్సీ, ఏస్టి కేసు విచారణ చేపట్టారు. అనంతరం మాదక ద్రవ్యాల పై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడటం వల్ల తమ జీవితాలు నాశనం కావడంతో పాటు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సక్రియ నాయక్, ఏ ఎస్ఐ దిగంబర్,సిబ్బంది పాల్గొన్నారు.