ఎస్సీ, ఎస్టీ కూలీలకు ఎక్కువ పని దినాలు కల్పించాలి

– పని ప్రదేశాల్లో కనీస వసతులు కల్పించాలి
– ఇన్ టైం లో పేమెంట్స్ ఇవ్వాలి
– నాచారం చెరువు పూడికతీత పనులు పరిశీలించిన 
– ఎన్ఐఆర్డీ ప్రొపెసర్, డాక్టర్  ముత్యాలు
నవతెలంగాణ – మల్హర్ రావు
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో జాబ్ కార్డులున్న ఎస్సి,ఎస్టీ కూలీలకు ఎక్కువ పని దినాలు కల్పించాలని ఎన్ఐఆర్డీ ప్రొపెసర్,డాక్టర్ ముత్యాలు ఉపాధిహామీ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం భూపాలపల్లి జిల్లా సిఆర్డి కోఆర్డినేటర్స్ రఘు, నితిన్,మండల  ఏపీఓ హరీష్ లతో కలిసి మండలంలోని నాచారం గ్రామంలో చెరువు పూడికతీత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా  క్లస్టర్ ఫెసిలెటేషన్ ప్రాజెక్టు కూలీలను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్ ఆర్ ఎం వర్క్స్, వాటర్ హారవిస్టింగ్, ఫారం ఫౌండ్స్, ఎస్సి, ఎస్టీ జాబ్ కార్డ్స్ కూలీలకు ఎక్కువ పని దినాలు కలిపించాలన్నారు. కూలీలకు అన్నిరకాల పేమెంట్స్ ఇన్ టైంలో పూర్తి చేయాలని సూచించారు. పని ప్రదేశాల్లో కూలీలకు మంచినీరు,నీడ, మెడికల్ కీట్స్, ఓఆర్ఎస్ తదితర కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. అనంతరం కూలీలకుఅన్ని, క్లస్టర్ ఫెసిలెటేషన్ ప్రాజెక్ట్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో  టెక్నికల్ అసిస్టెంట్స్ రమేష్, శేఖర్, సి సి వెంకట్, పంచాయతీ కార్యదర్శి రమేష్, ఫీల్డ్ అసిస్టెంట్ దేవేందర్, మేట్స్, కూలీలు పాల్గొన్నారు.