నవతెలంగాణా-ముత్తారం
సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి, మైదంబండ, ఓడేడు గ్రామాల్లో ఘనంగా వనదేవతలు గురువారం కొలువు దీరారు. మొదటగా బుధవారం సారలమ్మ, పెడిద్ద రాజులు గద్దెలకు చేరగా, గురువారం సమ్మక్క గద్దెకు చేరుకుంది. కోయ పూజారులు ప్రత్యేక పూజలునిర్వహించి వనం నుంచి జనంలోకి వనదేవతలను తీసుకువచ్చారు. సమ్మక్క సారలమ్మలు గద్దెకు చేరడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. దీంతో జాతర ప్రాంగణాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.