స్కీములు కాదు స్కాములు నడుస్తున్నాయి..

– తెలంగాణ రాష్ట్ర సేవాదళ్ యంగ్ బి గ్రేడ్ రాష్ట్ర అధ్యక్షులు తెల్ల శ్రావణ్ కుమార్
నవతెలంగాణ తుంగతుర్తి: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతికి పాల్పడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని సేవాదళ్ యంగ్ బిగ్రేడ్ రాష్ట్ర అధ్యక్షులు తెల్ల శ్రావణ్ కుమార్ అన్నారు. బుధవారం నియోజకవర్గ కేంద్రంలో సేవాదళ్ యంగ్ బిగ్రేడ్ జిల్లా అధ్యక్షులు కాసర్ల గణేష్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో స్కీములు ఏమి లేవని అన్ని స్కాములే నడుస్తున్నాయని అన్నారు. అవినీతి ప్రభుత్వాలను గద్దె దించడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు. అనంతరం సేవాదళ్ యంగ్ బి గ్రేడ్ నియోజకవర్గ అధ్యక్షునిగా గంగాధరి శ్రీధర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకొని నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ కొండ రాజు, పెద్దబోయిన అజయ్, ఉప్పుల రాంబాబు, హుస్సేన్, అబ్దుల్, సిద్ధిక్, అక్బర్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.