హర్రర్, కామెడీతో ఉండే సినిమాలకు అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి ఆదరణ లభిస్తోంది. అలాగే హర్రర్ కామెడీ జోనర్లలో వచ్చే చిత్రాలకు ఇటు ఓటీటీ, అటు థియేటర్లలో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు అదే ఫార్ములాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఓ మంచి ఘోస్ట్’ మూవీ. మార్క్‌సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్‌పై హాస్యభరితమైన హర్రర్ సినిమాగా ఇది రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన గ్లింప్స్, లిరికల్ సాంగ్ ఇలా ప్రతీ ఒక్కటీ ప్రేక్షకుల్లో బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇక తాజాగా రిలీజ్ చేసిన టీజర్ అందరినీ నవ్విండమే కాకుండా భయపెట్టేస్తోంది. ఈ టీజర్‌లోని విజువల్స్, ఆర్‌ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఆండ్రూ సినిమాటోగ్రఫీ, అనూప్ రూబెన్స్ ఇచ్చిన ఆర్‌ఆర్ టీజర్‌లో ఎక్కువగా హైలెట్ అవుతున్నాయి. ఈ చిత్రానికి సుప్రియ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఎడిటింగ్ బాధ్యతల్ని ఎం.ఆర్.వర్మ చేపట్టారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, హాస్యనటుడు రఘుబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.