గ్రామాల్లో విచ్చలవిడిగా దొంగతనాలు

– తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు
– ప్రజలు గుమ్మి కూడిన ప్రాంతాల్లో సెల్ ఫోన్లు ద్విచక్ర వాహనం దొంగిలిస్తున్న దోపిడీ దొంగలు 
నవతెలంగాణ – మిరు దొడ్డి 
తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసుకొని దొంగలు మరోసారి రెచ్చిపోయారు. బంగారం, వెండి, నగదు తో  ఉడాయించి పోలీసులకు సవాల్ విసిరినంత పని చేశారు. వారం రోజుల వ్యవధిలో దుబ్బాక సర్కిల్ పరిధిలో రెండు గ్రామాల్లో దొంగతనం జరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. నిఘా నేత్రాలు లేకపోవడంతో గ్రామాల్లో దోపిడి దొంగలు ఎక్కువగా రెచ్చిపోతున్నారు ఉపాధి కోసం వచ్చిన ఉపాధి లేక విచ్చలవిడిగా తిరుగుతూ గ్రామాల్లో చిల్లర దొంగతనాలు కూడా పాల్పడుతున్నట్లు సమాచారం. దుబ్బాక నియోజకవర్గం లో గత రెండు మూడు నెలల నుండి సంతలతో పాటు గుమ్మిగుడిన ప్రాంతాల్లో సెల్ ఫోన్లు మరియు ద్విచక్ర వాహనాలు దొంగతనాలకు పాటుపడుతున్నారు. సిద్దిపేట జిల్లా  మిరుదొడ్డి మండలంలోని అల్వాల గ్రామంలో ఒకేరోజు ఆరు ఇళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. మరుసటి నాలుగు రోజులు గడవకముందే దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో అర్ధరాత్రి తాళం వేసిన ఇండ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని నగదు, వెండి, బంగారాన్ని ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన మర్కంటి యాదమ్మ ఇంట్లో సుమారు 50 తులాల వెండి వస్తువులతో పాటు మూడున్నర తులాల బంగారం, 9 వేల నగదు, అదే గ్రామానికి చెందిన సాయి కృష్ణ ఇంట్లో తులం బంగారంతో పాటు రూ.14,500 రూపాయలు ఎత్తుకెళ్లినట్టు బాధితులు తెలిపారు. వారం రోజుల వ్యవధిలో మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్వాల గ్రామంలో చోరీ చేసిన దుండగులను పోలీసులు పట్టుకోకముందే మరోసారి దుబ్బాక పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో అదే రీతిలో దొంగతనం చేసి దుండగులు యదేచ్చగా తప్పించుకున్నారు. దుబ్బాక సర్కిల్ పరిధిలో వారం రోజుల వ్యవధిలో రెండు వేరు వేరు చోట్ల దొంగతనం జరగడంతో పోలీసులకు దొంగలు సవాల్ విసిరినంత పని జరిగిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. పోలీసులు త్వరలో దొంగతనాలకు పాల్పడుతున్న వారిని పట్టుకుని శిక్షించాలని గ్రామస్తులు పోలీసులతో కోరుతున్నారు.