– అడ్వాన్సుగా మూడు నెలల గ్రాంటు విడుదల
– అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు నియామక బాధ్యతలు
నవతెలంగాణ – మల్హర్ రావు
స్కావెంజర్లు లేక అద్వాన్నంగా తయారైన ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం కరుణ చూపింది. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్యం మెరుగు పడేట్లుగా చర్యలు చేపట్టింది.పాఠశాల శుభ్రత బాధ్యతలను ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటిలకు అప్పగించింది.విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిదులు విడుదల చేసింది. మండలంలో మొత్తం 37 పాఠశాలలు ఉన్నాయి.ఇందులో ప్రాథమిక 27,జిల్లా పరిషత్ 5,రెండు ప్రాథమికోన్నత, ఒక మోడల్ స్కూల్,ఒక కస్తూరి గాంధీ ఆశ్రమ పాఠశాల ఉన్నాయి.ఇందులో మొత్తము విద్యార్థులు 1853 మంది విద్యానభ్యసిస్తున్నారు. అలాగే 05 జీరో స్కూళ్లు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లు లేకపోవడంతో చాలాచోట్ల స్కూళ్ల పరిసరాలు అధ్వానంగా తయారయ్యాయి. దీంతో స్పందించిన ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టింది. టాయ్ లెట్లను శుభ్రం చేయడంతో పాటు మొక్కలకు నీళ్లు పట్టడం, పరిసరాలను శుభ్రం చేయడానికి స్థానికు లను నియమించుకోవాలని సూచించింది. నియామకం బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పగించింది.
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిధులు..
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం నిధులు కేటాయించింది. జీరో స్కూళ్లకు ఎలాంటి నిధులు ఇవ్వలేదు. 30 మందిలోపు ఉన్న స్కూళ్లకు నెలకు రూ.3 వేలు, 31 నుంచి వంద మంది వరకు ఉన్న స్కూళ్లకు రూ.6 వేలు, 101 నుంచి 250 మంది వరకు ఉన్న స్కూళ్లకు రూ.8 వేలు, 251నుంచి 500 మంది వరకు ఉన్న స్కూళ్లకు రూ.12 వేలు, 501 నుంచి 750 మంది ఉన్న స్కూళ్లకు రూ.15 వేలు, 750 పైన విద్యార్థులున్న స్కూళ్లకు రూ.20 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలిసింది.. ఏడాదిలో పది నెలలకు నిధులు ఇవ్వనుంది. తొలుత అడ్వాన్సుగా మూడు నెలలకు సరిపడా డబ్బులను డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు ఇవ్వనున్నారు.
పరిశుభ్రమైన వాతావరణం కోసం…
పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలదే. సమగ్ర శిక్ష కిం ద అందిస్తున్న కాంపోజిట్ స్కూల్ గ్రాంట్కు తేడా అదనంగా ఈ గ్రాంట్ అందిస్తున్నారు. పాఠశాలలో పరిశుభ్రమైన వాతావరణం అందించడంతో పాటు మరుగుదొడ్లు శుభ్రపర్చడం, మొక్కలకు నీరు పోయడం వంటి వాటికి ఈ నిధులను వినియోగిం చుకోవాలి. క్లీనింగ్, స్వీపింగ్ మొదలైన వాటికి అవ సరమైన మెటీరియల్ ఖర్చుకోసం సమగ్ర శిక్ష కింద పాఠశాలలకు విడుదల చేసిన కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ను వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.