– టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రంజిత్ కుమార్
నవతెలంగాణ-జనగామ
రాష్ట్రం లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకులాల్లో, మోడల్ స్కూళ్లలో కేజీబీవీ పాఠశాలల్లో ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని,. స్కావెంజర్ల నియామకం చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. జనగామ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన సంఘ జిల్లా విస్తృత కార్యవర్గ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు పిచ్చెట్టి చంద్రశేఖర్ రావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర కార్యదర్శి రంజిత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో గత ఏడాదిన్నర కాలంగా కొనసాగుతున్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ సజావుగా సాగడంలో రాష్ట్ర ప్రభుత్వం కృషిని అభినందిస్తున్నామన్నారు.. అదేవిధంగా ఇప్పటికే బకాయి పడ్డ ఐదు విడతల కరువు భత్యాన్ని ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని,. పీఆర్సీ నివేదికను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాసరావు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న అన్ని బిల్లులను తక్షణమే చెల్లించాలని, జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ దరఖాస్తులను పరిశీలించి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. జిల్లా ఉపాధ్యక్షుడు మంగు జయప్రకాశ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరుతో విద్యను కాషాయీకరణం చేసే కుట్ర చేస్తోందని, ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థుల కనీస వయస్సును 6సంవత్సరాలు చేయడం ఆ వయసుకు ముందున్న పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరకుండా నిలువరించడమేనని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షురాలు తాళ్లపల్లి హేమలత, కోశాధికారి తాడూరి సుధాకర్, జిల్లా కార్యదర్శులు చిక్కుడు శ్రీనివాస్, జ్యోతి శ్రీహరి,మహ్మద్ ముషీర్ ఖాన్, పత్తి వెంకటాద్రి,.కృష్ణ, తోట వేంకటేశ్వర్లు,.వివిధ మండలాల బాధ్యులు వీరమల్ల బాబయ్య, గుండె కనకయ్య, బేతి శ్రీధర్, ఆగయ్య, డోకురి రాములు, జంపయ్య, గెజిటెడ్ హెచ్‌ఎం పోతుగంటి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.