ఎస్సీ,బీసీ,మైనారిటీ కార్పొరేషన్ నిధులు విడుదల చేయాలి.

SC, BC, Minority Corporation funds should be released.– బీఎస్పీ మండల అధ్యక్షుడు గజ్జెల ప్రశాంత్
నవతెలంగాణ – వీర్నపల్లి
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కార్పొరేషన్ నిధులు విడుదల చేయాలని బిఎస్పీ మండల అధ్యక్షులు గజ్జెల ప్రశాంత్ ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు. వీర్నపల్లి మండల కేంద్రంలో బిఎస్పీ మండల అధ్యక్షులు గజ్జెల ప్రశాంత్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం హాయాంలో క్షేత్ర స్థాయిలో గ్రౌండింగ్  చేసి సెలెక్షన్ ప్రక్రియ పూర్తి చేసుకుని సంవత్సరాలు గడుస్తున్న లబ్ధిదారులకు ఇంతవరకు సబ్సిడీ వారి యొక్క బ్యాంక్ లలో వేయలేదన్నారు. ఆయా శాఖల ద్వారా నిధులు కేటాయించి వాటిని దారి మల్లిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ బిడ్డలకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతి వార్షిక సంవత్సరం కేవలం నిధులు కేటాయించడం వరకే కాని లబ్బిదారులను పట్టించుకునే పాపాన పోలేదన్నారు. కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఓట్లను ఓటు బ్యాంక్ గానే పాలక ప్రభుత్వాలు వాడుకుంటున్నాయన్నారు. కావున తక్షమే నిధులు విడుదల చేసి లబ్బిదారులను ఆదుకోవాలని  ప్రభుత్వాన్ని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పుతామన్నారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గుంటుకు రాజు, సిరికొండ జనార్ధన్, లంక నరేందర్, సంకూరి మధు తదితరులు పాల్గొన్నారు.