సీఎం ఆమోదం రాగానే బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌

– విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో తనను కలిసిన విలేకర్లతో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నుంచి ఆమోదం రాగానే షెడ్యూల్‌ను విడుదల చేస్తామన్నారు. ఇప్పటికే ప్రతిపాదనలను రూపొందించి రేవంత్‌రెడ్డికి విద్యాశాఖ పంపించిన సంగతి విదితమే. దానికి ఆమోదం లభించాల్సి ఉన్నది. రాష్ట్రంలోని ఉపాధ్యాయులు తొమ్మిదేండ్లుగా పదోన్నతుల కోసం, ఆరేండ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను ప్రకటించి సజావుగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఉపాధ్యాయ సంఘాలన్నీ కోరుతున్నాయి.