
అయితే పదో తరగతి పూర్తి చేసి ఇంటర్మీడియట్ లో ప్రవేశాలు పొందాలనుకునే వారు.. ఆన్ లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న మార్స్క్ మెమో, ఆధార్ కార్డును తప్పని సరిగా జతపరచాలి. తాము ఎంచుకున్న కాలేజీల్లో ప్రొవిజినల్ అడ్మిషన్ పూర్తి అయిన తర్వాత కచ్చితంగా విద్యార్థులు ఒరిజినల్ మెమోతో పాటుగా టీసీని కాలేజీలో సమర్పించాలి. పదో తరగతిలో వచ్చిన జీపీఏ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రవేశాల కోసం ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకూడదని ఇంటర్ బోర్డు ఆయా కాలేజీలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. విద్యార్థులు పూర్తి సమాచారం కోసం https://acadtsbie.cgg.gov.in/ వెబ్ సైట్ చూడవచ్చు.