నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆరుగ్యారంటీలను అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలను అందించాల్సిన అవసరం ఉందని మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న అన్నారు. శనివారం పట్టణంలోని ప్రజా పాలన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాల్గొని మాట్లాడారు పట్టణంలో ఎంతోమంది అర్హులైన వారు కోటి ఆశలతో దరఖాస్తులు చేసుకున్నారని అన్నారు. ప్రభుత్వం కలయాపన చేయకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించాలని కోరారు.