– ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ – భువనగిరి
ఇవి తాత్కాలిక జాబితాలే అని అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు ప్రభుత్వం పథకాలు అమలు అవుతాయని ఆదోళన చెందాల్సిన అవసరం లేదని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని హైద్రాబాద్ చౌరస్తా, ఆర్బీనగర్ పార్కులో ఏర్పాటు చేసిన మున్సిపల్ వార్డు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న నాలుగు సంక్షేమ పథకాలు మున్సిపాలిటీలో రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పూర్తి స్థాయిలో అమలు అవుతున్నట్లు మిగితా రెండు గ్రామాలలో లబ్ధిదారులు ఎక్కువ ఉన్నట్లు తెలిపారు. ఈసమావేశంలో భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
పోలీసులు పహారాలో వార్డు సభలు:
పోలీసులు పహారాలో వార్డు సభలు:
నాలుగు పథకాలు అములలో భాగంగా ప్రతి వార్డుసభ వద్ద ఎస్సై స్థాయి పోలీసు అధికారితో పాటు కానిస్టెబుల్‌తో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యే కుంభం వార్డు సభకు హాజరౌతున్న నేపథ్యంలో హైద్రాబాద్ చౌరస్తా వద్ద ప్రత్యేక పోలీసు బలగాలు ముందస్తుంగా చేరుకున్నారు. కొంత మంది సూఫారి డైన్స్‌తోపాటు, సీవిల్ డ్రేస్ వేసుకుని ప్రజల మధ్యలో ఉన్నారు. పర్యటన ముగిసే వరకు అప్రమత్తంగా ఉన్నారు. గతంలో పోలీసుల మధ్యంలో భువనగిరి పట్టణంలో ఇలాంటి వార్డు సభలు నిర్వహించలేదని ఇదే మొదటి సారి అని ప్రజలు అనుకుటున్నారు. నాలుగు పథకాలు అని చెప్పొద్దు. మున్సిపాలిటీలో నాలుగు పథకాలు అమలు అవుతున్నట్లు చెప్పొద్దని కేవలం రెండు పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పాలని బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షులు రత్నపురం బాలరాం ఎమ్మెల్యేను కోరారు. ఎమ్మెల్యే కుంభం మాట్లాడుతున్న సందర్భంగా మధ్యన కలుగజేసుకుని ఇందిరమ్మ ఆత్మీయ బారోస స్థానంలో పట్టణ ప్రజలకు మరోకి అమలు చేయాలిన ఆ పథకం కోసం 100 రోజుల పనిపుస్తకం తప్పని సరి కావడంతో మున్సిపాలిటీ ప్రజలు ఈ పథకం కోల్పోతున్నట్లు తెలిపారు. దింతో పాటు రైతు బరోసా కుడా పట్టణంలో ఎక్కవు అమలు కావడం లేదని తెలిపారు. ఈసందర్బంగాలో కొద్ది వాగ్వాదం చేసుకోవడంతో స్థానిక నాయకులు కలుగజేసుకొవడం సద్దిమణిగింది.