ఉపకార వేతనాల గడువు మార్చి 31వరకు పెంపు ..

Scholarship deadline extended till March 31.– మైనారిటీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎండీ యాకుబ్ పాషా
నవతెలంగాణ – పాల్వంచ 
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులు ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు తేదీని మార్చి 31వ తేదీ వరకు పొడిగించటం జరిగిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ యాకుబ్ పాషా ఆదివారం  ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 7,44,060 మంది విద్యార్దులు రెన్యువల్ చేసుకోవాల్సి ఉండగా 4,08,171 మంది విద్యార్దులు మాత్రమే ఈ- పాస్ వెబ్ సైట్ లో నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా ఫ్రెషర్స్ 4,83,254 మంది విద్యార్దులు నమోదు చేసుకోవాల్సి ఉండగా, కేవలం 1,39,044 మంది విద్యార్దులు మాత్రమే తమ పేర్లను నమోదు చేసుకోవడం జరిగిందని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశ్యంతో గడువు తేదీని పొడిగించడం జరిగిందని చెప్పారు. కావున, తక్షణమే ఫ్రెషర్స్, రెన్యువల్ విద్యార్దులు మార్చి 31లోపు http://telanganaepass.cgg.gov.in పోర్టల్ లో తమ వివరాలును నమోదు చేసుకోవాలని సూచించారు.