పట్టణంలోని జిరాయత్ నగర్ ప్రాథమిక పాఠశాల పూర్వ విద్యార్థి,సామాజిక సేవకుడు తులసి కుమార్ పట్వార్ మంగళవారం సన్మానించినారు. పుడమి రత్న జాతీయ స్థాయి విశిష్ట సేవా పురస్కారం-2024 గాను అవార్డు రావడం జిరాయత్ నగర్ పాఠశాలకు ఎంతో గర్వకారణమని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంతోషి రాణి కొనియాడారు.ఈ సందర్భంగా తులసి కుమార్ పట్వారీ పాఠశాల తరుపున, పీఆర్టీయు సంఘము తరుపున ఘనంగా సన్మానించడం జరిగినది. పట్టణ ప్రాంతంలో గత 15 సంవత్సరములుగా వివిధ రంగాలలో చేసిన సామాజిక సేవలను గుర్తించారని, జాతీయ మానవ హక్కుల న్యాయ పరిరక్షణ ఆధ్వర్యంలో జాతీయ ప్రశంసాపత్రం పొందడం కూడా అభినందనీయమని పీఆర్టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, జిల్లా మాజి అధ్యక్షులు తుమ్మల లక్ష్మణ్ పటేల్ సంతోషం వ్యక్తం చేశారు.తన వ్యక్తిగత ఖర్చు లతో సమాజ సేవ చేస్తున్న తులసి నేటి యువ తరానికి ఆదర్శమని పీఆర్టీయు జిల్లా ఉపాధ్యక్షులు వి లక్ష్మీ నారాయణ తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల తరుపున, పీఆర్టీయు సంఘం తరుపున సన్మానించడం తనకు సంతోషాన్ని కలిగించిందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయు ఆర్మూర్ అర్బన్ మండల శాఖ ప్రధాన కార్యదర్శి నరసింహా రెడ్డి,పాఠశాల ఉపాధ్యాయులు రాజు, హెబ్సిబా, సఫియా భాను, సదియా తబస్సుమ్, అదిబా తహ్నియత్, రజిని, సిబ్బంది, విద్యా ర్థులు పాల్గొన్నారు.