మండలంలోని గోకారం, జాలుకాల్వలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చౌటుప్పల్ లోని దివీస్ లేబరేటరీ వారి సౌజన్యంతో స్కూల్ బ్యాగులు, షూ గురువారం పంపిణి చేశారు. ఈ సందర్భముగా దివీస్ ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకొని పాఠశాలకు పుట్టిన గ్రామానికి మంచి పేరు తెచ్చి పెట్టాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు తుర్కపెల్లి మాధవి సురేందర్,మద్దెల సందీప్, దివిస్ సిఎస్ఆర్ ఇన్చార్జ్ వల్లూరు వెంకట్ రాజు, సాయి కృష్ణ, ప్రధానోపాధ్యాయులు యాదయ్య, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.