మండల కేంద్రంలోని సాహితీ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. మండలంలోని కమలాపూర్ శివారు పంట పొలంలోకి ప్రమాదవశాత్తు బోల్తా పడడంతో విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.