
బడి బయటి పిల్లలను బడిలో చేర్పించాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు చేపడుతుంది పిల్లలు పనిలో కాదు… పాఠశాలలో ఉండాలని ప్రజా ప్రతినిధులు, అధికారులు పదేపదే ఉపన్యాసం ఇస్తుంటారు. మరి ప్రభుత్వ బడిలో ఏం జరుగుతుంది ఉపాధ్యాయులు పిల్లలను పని మనుషుల్లాగా మార్చేస్తున్న సంఘటన ఉప్పునుంతల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ బడి పిల్లలు పని మనుషులుగా మారి పాఠశాల యూనిఫామ్ ఒంటిపైన ఉండగానే పాఠశాల బయట ఉన్న ఇసుక నెత్తిన బరువు గంప ఎత్తి పాఠశాలలోకి తీసుకెళ్తూ పని మనుషుల్లాగా మారి శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు గంపలు మోస్తూ కనిపించటం చర్చనీయాంశంగా మారింది.