శిక్షణ నిర్వాహకునికి పాఠశాల యజమాన్యాలు సన్మానం 

School employers honor the training managerనవతెలంగాణ – చండూరు 
సన్ పవర్ మార్షల్ ఆర్ట్స్ అఫ్ ఇండియా ఆధ్వర్యంలో 23వ సన్ పవర్ మార్షల్ ఆర్ట్స్ రాష్ట్ర స్థాయి పోటీలలో గాంధీజీ గీత, కేజీబివి, మరియానికేతన్, కృష్ణవేణి స్కూల ఆరుగురు విద్యార్థులు గోల్డ్ మెడల్స్  సాధించిన  ఐతరాజు జశ్వంత్, సంకోజు మణిదీప్, కారింగు మోక్షలక్ష్మి, కారింగు అభిరామ్, జన ఓమ్, కావలి శశాంక్,  9మంది సిల్వర్  సాధించినట్లు జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా కరాట నిర్వాకుడు కారింగ్ రవి తెలిపారు. గెలుపొందిన విజేతలకు  మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, మాజీ  ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి పతకాలు అందించినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కారింగు అనురూప్, సంకోజు సాయి ప్రణయ్, నక్కపోతు శృతి, దోమలపల్లి వైష్ణవి, దోమల పల్లి క్రిష్, యశ్వంత్, బీమనపల్లి వీణ  తదితరులు పాల్గొన్నారు.