20 నుంచి పాఠశాల యజమాన్యం కమిటీ ఎన్నికలు: ఇన్చార్జి ఎంఈఓ శ్రీనివాస్

నవ తెలంగాణ – జక్రాన్ పల్లి
మండలంలోని అన్ని గ్రామాలలో ప్రభుత్వపాఠశాలలకు పాఠశాల యజమాన్యం సభ్యుల ఎన్నిక కొరకు ఈనెల 20 నుంచి షెడ్యూల్ విడుదల అవుతుందని ఇన్చార్జి ఎంఈఓ శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు.
ఎన్నికల షెడ్యూల్ వివరాలు
20 న ఓటరు జాబితా ప్రకటన మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రకటించబడుతుంది.
22న ఉదయం 9 గంటల నుంచి 23 సాయంత్రం 4 గంటల వరకు ఓటర్ జాబితా అభ్యంతరాల స్వీకరణ నిర్వహించడం జరుగుతుందన్నారు.
24న ఉదయం 9 గంటలకు తుది జాబితా విడుదల చేయడం జరుగుతుంది.
29న ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది
29న మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాలకు చైర్మన్ వైస్ చైర్మన్ ల ఎన్నిక నిర్వహించడం జరిగింది తెలిపారు.
29 ను మొదటి సమావేశం  రెండు గంటలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఒకటవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు తరగతికి ముగ్గురు సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. ఇద్దరు సభ్యులను పాఠశాల యజమాన్య కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ లను ఎన్నిక నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.