పాఠశాల ప్రహరీ నిర్మాణం..

– భూమి పూజ చేసిన ఎమ్మెల్యే తోటలక్ష్మి కాంత్
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రేమరి పాటశాల ప్రహరీ గోడ నిర్మాణం కొరకు ఎన్ఆర్ఈజిఎస్ పథకంలో నిధులు మంజూరు కావడంతో శుక్రవారం నాడు జుక్కల్ శాసన సభ్యులు తోట లక్ష్మి కాంత్ రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రేస్ పార్టీ ప్రభుత్వం విద్యా కోసం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అందులో భాగంగానే ప్రహరీ గోడ నిర్మాణం కొరకు32 లక్షల58వేల రూపాయలు వంట గదుల కొరకు8 లక్షల 80 వేలరూపాయలు మరుగుదొడ్ల కొరకు7లక్షల91వేల రూపాయలు మంజరు అయిందని పేర్కొన్నారు. పనుల్లో నాణ్యతా లోపించుకుండా నిర్మాణం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి,మాజీ సర్పంచ్ నాగిరెడ్డి,మోహన్,శ్యామప్ప పటేల్,సంజీవ్,కల్లూరి పండరీ,వినోద్,రాంసింగ్,హన్మాండ్లు, బచ్చన్,రసీద్,ఫిరోజ్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.