
దాతల సహకారంతో పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని ప్రధానోపాధ్యాయులు జనార్ధన్ అన్నారు. మండలంలోని జామ్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సౌండ్ సిస్టమ్ అవసరం ఉందన్న విషయాన్ని.. కౌట్ల(బి) గ్రామానికి చెందిన కరుణాకర్ రెడ్డి దృష్టికి తీసుకు పొగా వెంటనే స్పందించి రూ.15 వేల మైక్ సెట్ ను శనివారం పాఠశాలకు అందజేసారు. గతంలో సైతం బ్యాండ్,విద్యార్థులకు రూ.10 వేల ప్రైజేస్ లను అందజేసారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. పాఠశాల సౌకర్యార్థం వివిధ వస్తులనుఅందజేసిన దాత కరుణాకరరెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ కార్ప్ విలాస్ పంచాయతీ కార్యదర్శి నరేష్ ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.