– ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతుల గదులు
– ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య
– ప్రభుత్వ పాఠశాలలో శిక్షణ పొందిన ఉపాధ్యాయుల విద్యా బోధన
– జిల్లాలో 5 లక్షల 50 వేల పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తాం
– జిల్లాలో త్వరలో 85 వేల 8.83 ఏకరూప దుస్తులు పంపిణీ
– బడిబాట కార్యక్రమంలో విద్యాశాఖ
– జిల్లా అధికారి రేణుక దేవి వెల్లడి
నవతెలంగాణ-పెద్దేముల్
ప్రభుత్వ పాఠశాలలు విజ్ఞానానికి నిలయాలని జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక దేవి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మంబాపూర్ ఎంపీపీఎస్ పాఠశాల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట రెండో రోజు కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి రేణుకదేవి పాల్గొని ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతి గదులు, మినరల్ వాటర్, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, ఉచిత యూనిఫాం తదితర సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వ పాఠ శాలలో పిల్లలను చేర్పించాలని విద్యార్థి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు, ప్రతి ఒక్కరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని అవ గాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలో శిక్షణ పొందిన ఉపాధ్యాయుల విద్యా బోధన బోధిస్తున్నారు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వికారాబాద్ జిల్లాలో 5 లక్షల 50 వేలు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయ న్నారు. జిల్లాలో త్వరలో 85 వేల, 883 విద్యార్థులకు ఏక రూప దుస్తులు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. జిల్లాలో ఉపాధ్యాయులు మంచి విద్య బోధ న అందించడం ద్వారానే 10వ తరగతి మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వి ద్యార్థులు సద్వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో ఇంచార్జ్ విద్యాధికారి వెంకటయ్య గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, రవీందర్ నాథ్, ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మెన్లు జ్యోతి, మంజుల, ఉపాధ్యా యు లు మాధురి, విజయలక్ష్మి, సంగీత, అనంతయ్య, శ్రీకాంత్, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.