
చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం ప్రగతి ఉన్నత పాఠశాలలో బుధవారం జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. పాఠశాల విద్యార్థిన విద్యార్థులు పలు రకాల ప్రయోగాలు చేసి వాటి గురించి వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సయ్యద్ మాట్లాడుతూ సివి రామన్ కనుగొన్న రామన్ ఎఫెక్ట్ ను ఫిబ్రవరి 28న కనుగొన్నారని, ఈ ఫిబ్రవరి 28వ తేదీనే జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటారని పిల్లలకు చెప్పారు. సివి రామన్ ను ఆదర్శంగా తీసుకొని పాఠశాల దశ నుంచే విద్యార్థులు ప్రయోగాలు చేపట్టాలని కొత్త కొత్త ఆవిష్కరణలు తీసుకురావా లని సూచించారు.విద్యార్థులు చంద్రయాన్, డయాలసిస్,రెస్పిరేటరీ సిస్టం నర్వ సిస్టం,హార్ట్ వర్కింగ్,వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాజెక్టులను తయారుచేసి సైన్స్ ఫెయిర్ లో ప్రదర్శనగా తిలకించారని పాఠశాల ప్రిన్సిపల్ సయ్యద్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.