అంక్సాపూర్ ఉన్నత పాఠశాలలో సైన్సు దినోత్సవ కార్యక్రమం

నవతెలంగాణ – ( వేల్పూర్ )  ఆర్మూర్
మండలంలోని అంక్సాపూర్ ఉన్నత పాఠశాల యందు జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయ బృందం శనివారం ఆన్లైన్ పరీక్షలు నిర్వహించినారు. మండల కేంద్రానికి చెందిన రితీష్ అనే విద్యార్థి, మండలంలోని కోమన్ పల్లి పాఠశాలకు చెందిన సహస్ర అనే విద్యార్థిని గెలుపొంద, ఈనెల 20వ తేదీ జిల్లాస్థాయి పోటీలలో పాల్గొంటున్నారని భౌతిక శాస్త్ర సంఘం అధ్యక్షులు పసుపుల రఘునాథ్ తెలిపారు. ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ హరిచరణ్, భౌతిక ,రసాయన ,జీవశాస్త్ర ఉపాధ్యాయులు మనోహర్ ,రవిచందర్, కవిత, సునీత తదితరులు పాల్గొన్నారు.