ప్రైవేట్ పాఠశాలల్లో సైన్స్ ఫెయిర్ వేడుకలు

నవతెలంగాణ  – భీంగల్
భౌతిక శాస్త్ర పితామహుడు రామానుజన్ జయంతిని పురస్కరించుకొని పట్టణ కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్, విజయ , శ్రీ సరస్వతి విద్యా మందిర్, కృషి, విశ్వ భారతి ముచ్కూర్ గ్రామంలోని జ్ఞానోదయ పాఠశాలల్లో సైన్స్ వేర్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సైన్స్ ఫెయిర్ లో విద్యార్థులు నీటి, బొగ్గు నుండి విద్యుత్ ఉత్పత్తి తదితర అంశాలపై ప్రదర్శనలు నిర్వహించారు. విశ్వభారతి పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగ అంశాలను ఎం ఈ ఓ స్వామి పరిశీలించి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల కరస్పాండెంట్ , ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.