‘ప్రగతి పాఠశాల’లో సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్

నవతెలంగాణ-రామగిరి 
రామగిరి మండలంలోని కలచర్ల గ్రామ పరిధి ప్రగతి ఉన్నత పాఠశాలలో సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. విద్యార్థిని విద్యార్థులు సైన్స్ ఫెయిర్ నమూనాలు సైన్స్ అండ్ టెక్నాలజీ పైన వివిధ రకాల ఎగ్జిబిట్స్ ప్రదర్శించారు. అందులో ముఖ్యంగా ఆహారం ఆరోగ్యం మరియు పరిశుభ్రత, రవాణా, సమాచారం, వ్యర్థాల నిర్వహణ, వనరుల నిర్వహణ, గణిత నమూనాలు, కంప్యూటర్ రైజేషన్ థింకింగ్. పై అంశాలపై 80 రకాల ఎగ్జిబిట్స్ నమూనాలు విద్యార్థులను ఆకర్షించాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ అబ్బు, కేశవరెడ్డి  మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన టెక్నాలజీని అనుసరించి తమ మేథో సంపత్తిని పెంపొందించుకోవాలని విద్యార్థి, విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ రాము, సైన్స్ ఉపాధ్యాయయలు టి సత్యనారాయణ, రవీందర్, వీర రాజు, అధ్యాపక బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.