శ్రీ చైతన్య విద్యానికేతన్ లో సైన్స్ ఫెయిర్..

Science Fair at Sri Chaitanya Vidyanikethan..నవతెలంగాణ – భిక్కనూర్
మండల కేంద్రంలోని శ్రీ చైతన్య విద్యానికేతన్ పాఠశాలలో గురువారం సైన్స్ ఫెయిర్  కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ‌ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సాంకేతిక నైపుణ్యాలను వెలికి తీసి వారి ప్రతిభకు పదును పెట్టడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహద పడుతాయన్నారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ రేణు కుమార్, ప్రిన్సిపల్ అశోక్ యాదవ్ మాట్లాడుతూ  విద్యార్థులు తయారు చేసిన సాంకేతిక సాంస్కృతిక పర్యావరణ ప్రాజెక్టులను తయారు చేయడానికి విద్యార్థులు చాలా కష్టపడ్డారని, విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శివప్రసాద్, ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, ఎంఈఓ రాజా గంగారెడ్డి, సిఐ  సంపత్ కుమార్, ఎస్సై ఆంజనేయులు, టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి, సీనియర్ అడ్వకేట్లు బిక్షపతి, నంద రమేష్, శ్రీధర్, రాజబాబు గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసింహారెడ్డి, లింబాద్రి, వెంకటేష్, అంకం రాజు, రవీందర్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.