– సైన్స్‌ను కెరీర్‌గా ఎంచుకోండి
– నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ గ్రెగ్ ఎల్.సెమెంజా
– గీతంలో ‘భారతదేశ అభివృద్ధి కోసం దేశీయ పరిజ్ఞానం’పై సదస్సు
నవతెలంగాణ-పటాన్‌చెరు
సైన్స్ (శాస్త్రం) ఎన్నో ఆవిష్కరణలకు బాటలు వేసి, మానవ జీవన ప్రమాణాల మెరుగుదలకు దోహదపడుతోందని, దానిని కెరీర్‌గా చేసుకోవాలని వర్ణమాన శాస్త్రవేత్తలు, నోబెల్ బహుమతి గ్రహీత, జాన్స్ హాప్కి స్కూల్ ఆఫ్ మెడిసిన్టిని జెనిటెక్ మెడియన్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ గ్రెగ్ ఎల్.సెమెంచాతో సూచించారు. ‘రా’ ఆవిష్కరణను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ‘భారతదేశ అభివృద్ధి కోసం దేశీయ పరిజ్ఞానం’పై నిర్వహించిన సదస్సులో గ్రెగ్ మాట్లాడుతూ.. తన పాఠశాల రోజులు, విద్యా బుద్ధులు నేర్పి ఎదిగేందుకు ఊతమిచ్చిన తన అభ్యసకురాలు డాక్టర్ రోజన్ ఎస్. నెల్సన్‌ను గుర్తు చేసుకున్నారు. ముందుగా ఒక ఆలోచనతో ముందు కొచ్చినప్పుడు దాన్ని పరీక్షించాలని, దానికి తమలోని సృజనాత్మకతతో పాటు శాస్త్రీయ ఆలోచనలు అభివృద్ధికి దోహదం చేస్తాయని తెలిపారు. తన పరిశోధన నోబెల్ బహుమతి పొందిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను నియం త్రించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రోటీన్ హెస్టోని ప్రేరేపించగల కారకాన్ని కనుగొనడానికి దారితీసిన సంచలనాత్మక పరిశోధనను విశదీకరించారు. అంతర్ విభాగ జ్ఞానాన్ని మార్పిడి చేసుకునే, సహ కార వేదికలుగా తోడ్పడే సెల్ కల్చర్ ల్యాబ్, సెంట్రల్ ఇన్‌స్ట్రూమెంట్ ఫెసిలిటీ ల్యాబ్‌లను ఈ సందర్భంగా ఆయన ప్రారంభించారు.
సుస్థిర భవిష్యత్తు కోసం హరిత కార్యక్రమంగా ఒక మొక్కను నాటారు. ఆ తరువాత కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అధ్యాపకులతో ముఖాముఖి నిర్వహించారు. తొలుత భారత శాస్త్ర, సాంకేతిక విభాగం కార్యదర్శి డాక్టర్ ఎస్.చంద్రశేఖర్‌ను పరిచయం చేయడంతో పాటు జాతీయ సైన్స్ దినోత్సవ ప్రాముఖ్యతను వివరిం చారు. గీతం హైదరాబాద్ ఆదనపు ప్రొఫెసర్ డీఎస్. రావు, డాక్టర్ గ్రేగ్‌ను శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఎఫిస్టెమో వికాస్ లీడర్ షిప్ స్కూల్, కానరి గ్లోబల్ స్కూల్, డీసీఎస్-మియా పూర్, శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్, పల్లని ఇంటర్నే షనల్ స్కూల్ – కీసర, జెనెసిస్ ఇంటర్నేషన్ స్కూల్ (మూడు శాఖలు), పయనీర్స్ ఇంటర్నేషన్ స్కూల్, రావుస్ ఇంటర్నేషనల్ స్కూల్ వంటి ఎనిమిది విభిన్న పాఠశాలం నుంచి దాదాపు 800 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ గ్రేగ్‌ను అడిగి పలు సందేహాలు నివృత్తి చేసుకున్నారు.