చరిత్ర చదువని వారు చరిత్ర నిర్మించ లేరు అంటారు నవభారత నిర్మాత బిఆర్ అంబేద్కర్. నేటి తరం సర్ సి.వి.రామన్ (చంద్రశేఖర్ వెంకట రామన్) చరిత్ర తప్ప కుండా చదువాలి. గొప్ప శాస్త్రవేత్తగా దేశానికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారు. రామన్ సేవలకు గుర్తింపుగా ఆసియా ఖండం లోనే నోబెల్ పురస్కారం అందుకున్న మొట్ట మొదటి వ్యక్తిగా గుర్తింపుపొందారు. 7 నవం బర్ 1888న తమిళనాడులోని తిరుచుర పల్లిలో చంద్రశేఖర్ రామనాథన్ అయ్యర్, పార్వతి అమ్మల్ దంపతులకు రామన్ జన్మిం చారు. 12 ఏళ్లకే మెట్రిక్యులేషన్ పూర్తిచేసి మద్రాస్ యూ నివర్సిటీ నుంచి భౌతిక శాస్త్ర మాస్టర్ డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించిన తొలి వ్యక్తిగా రామన్ చరిత్ర సృష్టించారు. కాంతి ధర్మా లపై అనేక పరిశోధనాత్మక వ్యాసాలు రాశాడు. కాంతి పరి క్షేపణం గురించి పరిశోధనలు చేసి పారదర్శ కంగా ఉన్న ఘన, ద్రవ, వాయు పదార్థాల గుండా కాంతి ప్రసరించినప్పుడు తన స్వభా వాన్ని మార్చుకుంటుందని సర్ సివి రామన్ తన పరిశోధనలను రామన్ ఎఫెక్ట్‌గా 28 ఫిబ్రవరి 1928లో ప్రతిపాదిం చాడు. దీనికి 1930లో నోబెల్ పురస్కారం వచ్చింది.శాస్త్ర సాంకేతిక రంగానికి చేసిన సేవ లకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1954లో దేశపు అత్యున్నత పురస్కారం భారతరత్నను సివి రామన్‌కు ప్రకటించింది. దేశం గర్వించ దగ్గ భారతరత్నం సివి రామన్ 82 ఏండ్ల వయసులో 21 నవంబర్ 1970లో కన్ను మూశారు.
”నా జీవితం పూర్తిగా విఫలమైంది నేను ఈ దేశంలో నిజమైన విజ్ఞాన శాస్త్రాన్ని నిర్మిం చడానికి ప్రయత్నిస్తానని అనుకున్నాను కానీ మన వద్ద ఉన్నది పాశ్చాత్య దేశాల అనుచ రులు మాత్రమే” అని రామన్ అన్న మాటలు మనం గమనంలో ఉంచుకోవాలి. పాలకులు తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం కావాలని ప్రజలను శాస్త్రీయ వైజ్ఞానిక దృక్ప థానికి దూరం చేస్తున్నారని, పరిశోధనా రంగా లను ప్రోత్సహించడం లేదని రామన్ మాటల్లో దాగి ఉన్న నిగూడ అర్థం. నా మతం సైన్స్ జీవితాంతం దానినే ఆరాధిస్తా అని చెప్పిన గొప్ప దార్శనికుడు సివి రామన్.
భారతీయుల్లో శాస్త్రీయ దృక్పథం పెంచ డానికి, వైజ్ఞానిక స్ఫూర్తి నింపడానికి జాతీయ సైన్స్ దినోత్సవాన్ని 28 ఫిబ్రవరి 1987 నుండి ప్రతీ యేటా నిర్వహించుకుంటున్నాం. ప్రతి ఏడాది సైన్స్ దినోత్సవానికి ఒక ఇతి వృత్తం ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించడం పరిపాటి.
2024లో ‘Indigenous Technologi es for Viksit Bharath’ ”వికసిత్ భారత్ కోసం స్వదేశీ సాంకేతికతలను’ ప్రోత్సహించ డం ప్రపంచ ఆందోళనలను పరిష్కరించ డంలో సహాయపడడం సైన్స్ ద్వారా భారత దేశాన్ని ‘ఆత్మనిర్భర్ భారత్‌గా మార్చాలి అనే థీమ్‌ను నేష నల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ (TC) ప్రకటించింది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 ఏ ప్రకారం భారతీయుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, హేతుబద్ధమైన ఆలోచనను విధిగా పెంపొం దించాలి. గత 75 సంవత్సరాల లో భారత దేశం ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ఎంతో పురోభివృద్ధి సాధించింది. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న మొదటి ఐదు దేశాల్లో భారతదేశం కూడా ఉం డడం మనకెంతో గర్వకారణం. గ్లోబల్ ఇన్నో వేషన్ ఇండెక్స్‌లో ప్రస్తుతం భారతదేశం 40వ స్థానంలో ఉంది. 2015లో భారత దేశం ర్యాంకు 81. భారతదేశం నుండి 90000 పెటెంట్లు రిజిస్టర్ చేయడం ద్వారా పరిశోధనా రంగంలో పురోగతినీ మనం అర్థం చేసుకోవచ్చు.
బాల్యం నుండే బాలబాలికల్లో పాలకులు, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అమూర్త భావ నలను, మూఢనమ్మకాలను పెంపొందించడం వల్ల వారిలో మూఢనమ్మకాలు పెరుగుతూ, శాస్త్రీయ వైఖరులు తగ్గుతున్నాయి. పాలకులు మత విశ్వాసాలను మూఢనమ్మకాలను ప్రజల్లో పెంచి పోషిస్తున్న ఈ తరుణంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి దేశ ప్రజలలో శాస్త్రీయ వైఖరులు పెంపొందించేం దుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది.
ఆధునిక మానవాళి అనుభవిస్తున్న అన్ని సౌకర్యాలకు మూలం సైన్స్. అంతరిక్షయానం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ఆధు నిక సాంకేతిక పరిజ్ఞాన్ని మనం వాడుతున్నాం. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహ మ్మారి నుండి ప్రజలను కాపాడింది సైన్స్ మా త్రమే. ఏ మత విశ్వాసాలు కానీ మూడ నమ్మ కాలుగానీ ప్రజలను కాపడలేదు. కారల్‌మార్క్స్ చెప్పినట్లు తత్వవేత్తలు సమాజాన్ని పరిపరి విధాలుగా విశ్లేషిస్తారు, కానీ చేయాల్సింది సమాజాన్ని మార్చడమే. సమాజాన్ని వైజ్ఞానిక దృక్పథం వైపు మార్చి, చీకటి నుండి కాంతి వైపు ప్రయాణించేలా చేసే శక్తి కేవలం సైన్స్‌కు మాత్రమే ఉంది. ఆ శక్తిని ప్రజలకు అందించేది పాలకులు, గురువులే.
జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ కోసం జాతీయ అవా ర్డులు అందజే యడం ద్వారా ప్రజలలో సైన్స్ కు ప్రాచుర్యం కల్పించడం, బాలలను శాస్త్రీయ పరిశోధనల వైపు ప్రోత్సహించడం, ఇన్నో వేషన్ హబ్, స్టార్ట్‌అప్‌లు ఏర్పాటు చేయడం. మీడియా మరియు సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో శాస్త్రీయ ఆలోచనలను ప్రచారం చేయడం విద్యాసంస్థల్లో సైన్స్ ఎగ్జిబిషన్‌లు ఏర్పాటు చేయడం వర్క్‌షాప్‌లు ఉపన్యా సాలు సెమినార్‌లు నిర్వహించడం. శాస్త్రీయ సాంకే తిక రంగాల్లో తాజా పురోహితులు విజయా లపై విశ్లేషణలు ప్రదర్శించడం, శాస్త్రీయ విజ్ఞాన ప్రాముఖ్యతను రోజువారి జీవితంలో ఉపయోగాలని తెలియజేసే సమాచారాన్ని వ్యాప్తి చేయడంతో ప్రజల ఆలోచనా సరళిని మార్చవచ్చు.
సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్‌తో దేశీ యికరణ స్వయం సమృద్ధి సాధించడం, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దేశ ప్రగతిలో ఎదురయ్యే సవాలను పరిష్కరించడం, ప్రపం చ మానవాళి శ్రేయస్సు కోసం భారతదేశ శాస్త్రీ య పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా భారతదేశాన్ని వికసిత ఆత్మనిర్భర్‌గా మార్చడంలో ప్రాముఖ్యత ఇవ్వడం. 2047 అమఅత్ కాల్ దీక్షిత్ భారత్‌ను సాధించే ప్రక్రి యలో ఈ సంవత్సరం ఎంచుకున్న థీమ్ ఒక ముందడుగు.ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం వల్ల ప్రశించేతత్వం, హేతుబద్ధమైన ఆలోచన, మానవీయత, సెక్యులరిజం వంటి లక్షణాలు పెంపొందుతాయి.భారత రాజ్యాంగ మౌలిక లక్షణాలు కలిగిన పౌరులుగా తీర్చిదిద్దబడు తారు. పౌర సమాజంలో శాస్త్రీయ వైఖరులు పెంచే బాధ్యత మనందరిది.
(నేడు జాతీయ వైజ్ఞానిక దినోత్సవం)
– పాకాల శంకర్‌గౌడ్, 9848377734