విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి

నవతెలంగాణ – డిచ్ పల్లి
విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని,మూడనమ్మకాలు పోగొట్టడానికి జనవిజ్ఞాన వేదిక కృషి అవసరమని జిల్లా అద్యక్షులు కొయెడి నర్సింలు అన్నారు. బుదవారం  డిచ్ పల్లి మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ధర్మారం బి లో సి వి రామన్  భౌతిక భౌతిక శాస్త్ర వేత్త రామన్ ఎఫెక్ట్స్ కనుగొన్న రోజలు 28 సందర్భంగా) సందర్బంగా  మండలస్థాయి ఉపన్యాస, వ్యాసరచన పోటీలను 8,9,10 తరగతి విద్యార్థులకు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనవిజ్ఞాన వేదిక జిల్లా అద్యక్షులు కోయెడి నర్సింలు పాల్గొని మాట్లాడుతూ.. మూడనమ్మకాలు పోగొట్టడానికి జనవిజ్ఞాన కృషి అవసరమన్నారు.బర్దిపుర్ సహకార సొసైటీ చైర్మన్ కొసరాజ రామకృష్ణ  మాట్లాడుతూ దేశబివృద్ధికి సైన్స్ విషేశ కృషి చేస్తుందని అన్నారు. మండల జనవిజ్ఞాన వేదిక కన్వీనర్  తలారి సాయన్న మాట్లాడుతూ శాస్త్ర వేత్తలు సమాజ శ్రేయస్సు కొరకు వారు జీవితాలను ధార పోస్తురని, విద్యార్థులు శాస్త్ర వేత్తల కృషిని ఆదర్శంగా తీసుకోవలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానో పాధ్యాయురాలు సంద్యా నాయక్,  ఉపాధ్యాయులు మాముర్,మం డల కన్వీనర్ -బోడ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.అనంతరంపాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను అతిధులు సందర్శించి విద్యార్థులను ప్రశంశించారు.అంతకుముందు విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. “శాస్త్రీయ దృక్పథం – నేటి అవసరం “లో రిశ్వంత్, అక్షర, శ్రీజ మొదటి, రెండవ,ముడవ బహుమతులను అందచేశారు.ఉపన్యాస పోటిలో మొదటి శ్రీజ, ద్వతీయ అక్షర, తృతీయ మానస ఉన్నారు.